
విజయనగరం, గరుగుబిల్లి : నాగావళి నదీతీర గ్రామాలలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఆదివారం ఉదయానికి గొట్టివలస, తులసిరామినాయుడువలస మీదుగా ఉల్లిభద్ర పరిసరాల్లోకి చేరుకున్నాయి. సాయంత్రానికి డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన కళాశాల పరిసరాల్లో దర్శనమిచ్చాయి. వారం రోజుల నుంచి మండలంలోని సంతోషపురం, సుంకి, పిట్టలమెట్ట, నాగూరు, గిజబ, తోటపల్లి, రావివలస, గొట్టివలస, తదితర గ్రామాలలో సంచరిస్తూ అరటి, జొన్న, కూరగాయల పంటలను నాశనం చేశాయి.