బావిలో పడ్డ ఏనుగు పిల్ల : ఏనుగుల బీభత్సం | Elephant calf accidentally falls into well | Sakshi
Sakshi News home page

బావిలో పడ్డ ఏనుగు పిల్ల : ఏనుగుల బీభత్సం

Aug 23 2015 8:22 AM | Updated on Jul 11 2019 6:30 PM

మందతో వెళ్తున్న ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు నీరు లేని బావిలో పడింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చిక్కపల్లితండా గ్రామంలో ఆదివారం వేకువజామున జరిగింది.

రామకుప్పం (చిత్తూరు జిల్లా) : మందతో వెళ్తున్న ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు నీరు లేని బావిలో పడింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చిక్కపల్లితండా గ్రామంలో  ఆదివారం వేకువజామున జరిగింది. వివరాల ప్రకారం.. చిక్కపల్లితండా గ్రామంలోకి వేకువజామున ఏనుగులు ప్రవేశించాయి. అయితే అవి మందగా వెళ్తుండగా ఏడాది వయసున్న ఓ ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు నీళ్లు లేని బావిలో పడింది.

దీంతో మిగిలిన ఏనుగులు ఘీంకారం చేస్తూ ఆ ప్రాంతంలోని పంట పొలాల్లో బీభత్సం సృష్టించాయి. దీంతో వేరుశనగ, వరి, టమాటా పంటలు నాశనమయ్యాయి. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఏనుగులను అడవిలోకి పంపించారు. అనంతరం బావిలో ఉన్న ఏనుగు పిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement