చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలం గుడిసెవారిపల్లిలో మంగళవారం విద్యుదాఘాతంతో ఒక యువకుడు మృతిచెందాడు.
మదనపల్లి రూరల్(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలం గుడిసెవారిపల్లిలో మంగళవారం విద్యుదాఘాతంతో ఒక యువకుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన బాలాజీ(30) టాటాఏస్ వాహనంలో పాలు సరఫరాచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడు. ఇంట్లో మంగళవారం సాయంత్రం స్నానంచేసి ఇనుప వైరుపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
మృతునికి భార్య సంధ్య ఉంది. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది.