పోరాటాల పురిటిగడ్డ..అవనిగడ్డ

Election Special Avanigadda Assembly Constituency Review - Sakshi

సాక్షి, అవనిగడ్డ : జిల్లాకు తూర్పున.. కృష్ణమ్మ చెంతన ఏర్పడింది అవనిగడ్డ నియోజకవర్గం. ఆరు మండలాలతో అతిపెద్ద నియోజక వర్గంగా ఖ్యాతికెక్కింది. ప్రశాంత కు మారుపేరైన ఈ పల్లెసీమల నుంచే ఎందరో ఉద్దండులైన రాజ కీయ  నాయకులు జన్మించారు. ఇక ఉద్యమాలకు ఊపిరిలూదిందీ ఈ పురిటిగడ్డే. బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. గాంధీ జీ ఉద్యమ స్పూర్తికి ఊపిరి పోశా రు. జమిందారీ వ్యవస్థ్ధపై ఉక్కుపిడికిలి బిగించారు. భూపోరాటా లతో మార్గదర్శకులయ్యారు.

1952 అవనిగడ్డ దివి నియోజకవర్గంగా ఏర్పడింది. దివి ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అవనిగడ్డ, నిడుమోలు నియోజకవర్గాలు కలిసి ఉండేవి. దివి తాలూకా నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవారు.  అవనిగడ్డ నియోజకవర్గంకు జిల్లాలో ప్రత్యేకతక ఉంది. 1972లో ఏకగీవ్రం కాగా జిల్లాలో ఈ ఘనత సాధిం చారు. అవనిగడ్డ. ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు హాట్రిక్‌ సాధించారు కమ్యునిస్టు యోధులు చండ్రరామలింగయ్య, గుంటూరు బాపనయ్య, సనకా బుచ్చికోటయ్యతో గాంధేయవాది మండలి వెంకటకృష్ణారావు, దేవుడి మంత్రి సింహాద్రి సత్యనారాయణ వంటి నాయకులను ఈ గడ్డ అందించింది. 

ఏడుసార్లు కాంగ్రెస్‌.. ఆరు సార్లు టీడీపీ

  • 1962లో అవనిగడ్డ నియోజకవర్గం ఏర్పడింది.
  • 1962ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి వై శివరాంప్రసాద్, కమ్మునిస్టు పార్టీ అభ్యర్ధి సనకా బుచ్చికోటయ్యపై 2992 ఓట్లతో గెలుపొందారు.
  • 1967లో ఈ ఇద్దరే తలపడగా శివరాం ప్రసాద్‌ 8663ఓట్లతో గెలుపొందారు.
  • 1972లో మండలి వెంకట కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • 1978లో మండలి వెంకట కృష్ణారావు, జనతా అభ్యర్థి సైకం అర్జునరావుపై 490 ఓట్లతో గెలుపొందారు.
  • 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు గెలుపొందారు.
  • 1985లో టీడీపీ అభ్యర్ధి సింహాద్రి సత్యనారాయణరావు, మండలి వెంకట కృష్ణారావుపై 6683ఓట్లతో గెలుపొందారు.
  • 1989లో వీరిద్దరే పోటీపడగా సింహాద్రి సత్యనారాయణరావు 167ఓట్లతో గెలుపొందారు. 
  • 1994లో సింహాద్రి సత్యనారాయణరావు, కాంగ్రెస్‌ అభ్యర్ధి మండలి బుద్ధప్రసాద్‌పై 5377ఓట్లతో గెలుపొందారు.
  • 1999లో మండలి బుద్ధప్రసాద్, టీడీపీ అభ్యర్ధి బూరగడ్డ రమేష్‌నాయుడుపై 794ఓట్లతో గెలుపొందారు.
  • 2004లో వీరిద్దరే పోటీపడగా, మండలి బుద్ధప్రసాద్‌ 8483ఓట్లతో గెలుపొందారు.
  • 2009లో టీడీపీ అభ్యర్ధి అంబటి బ్రహ్మణయ్య, మండలి బుద్ధప్రసాద్‌పై 417ఓట్లతో గెలుపొందారు.
  • 2013లో బ్రాహ్మణయ్య మరణంతో జరిగిన ఎన్నికల్లో ఆయన తనయుడు అంబటి శ్రీహరిప్రసాద్, ఇండిపెండెంట్‌ అభ్యర్ధి సైకం రాజశేఖర్‌పై 61,644 ఓట్లతో గెలుపొందారు.
  • 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన మండలి బుద్ధప్రసాద్, సింహాద్రి రమేష్‌బాబుపై 5859 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

హ్యాట్రిక్‌లతో పాటు మంత్రి పదవులు
అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో యార్లగడ్డ శివరాంప్రసాద్‌ 1955, 1962, 1967 వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందం మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేయగా, 1972, 1978, 1983లో మండలి వెంకట కృష్ణారావు హ్యాట్రిక్‌ సాధించగా, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు.

1985, 1989, 1994లో హ్యాట్రిక్‌ సాధించిన సింహాద్రి సత్యనారాయణరావు ఎన్‌టీరామారావు, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా చేశారు. 1962, 1967లో సనకా బుచ్చికోటయ్య, 1985, 1989లో మండలి వెంకటకృష్ణారావు, 1999, 2004లో బూరగడ్డ రమేష్‌నాయుడు వరుసగా పరాజయం పాలయ్యారు. తండ్రీ కొడుకులు మండలి వెంకట కృష్ణారావు, మండలి బుద్ధప్రసాద్‌ ఇద్దరినీ ఓడించిన ఘనత సింహాద్రి సత్యనారాయణకు దక్కింది.

జిల్లాలో ఏకైక ఏకగ్రీవ నియోజకవర్గం 
1972లో జరిగిన ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో ఏకైక ఏకగ్రీవ నియోజకవర్గంగా అవనిగడ్డ రికార్డు సాధించింది. మూడు సార్లు హ్యాట్రిక్‌ సాధించి, మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణరావు 2004లో ఇండిపెండెంట్‌గా  పోటీచేయగా 14,845 ఓట్లతో మూడో స్ధానంకు పరిమితమయ్యారు.

సామాజిక వర్గాలే  కీలకం
కాపు సామాజిక వర్గం :  69,500
బీసీలు :  64,600
మత్స్యకార సామాజిక వర్గం : 29,400 
ఎస్సీలు :  41,450
ఎస్టీలు :  6,460 ఉన్నారు
కమ్మ  సామాజిక వర్గం : 9,800 మంది
ముస్లీంలు : 3,840 

నియోజకవర్గం జనాభా : 2,63,771 
ఓటర్లు : 2,12,830 
పురుషులు : 1,06,171
స్త్రీలు : 1,06,640
పోలింగ్‌ బూత్‌లు మొత్తం : 266

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top