breaking news
mandali budha prasad
-
‘తెలుగు భాష విదేశాల్లోనే వెలుగు చూస్తోంది’
చికాగో: వర్తమాన ఆంధ్ర దేశంలో రాజకీయ వేత్తగా, ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రజాసేవకుడు, గాంధీతత్త్వ ప్రచారకునిగా, రచయిత, సంపాదకునిగా సమున్నత స్థానాన్ని సంపాదించుకున్న మండలి బుద్ధ ప్రసాద్‌ను చికాగోలోని భారతీ తీర్థ సంస్థ ఘనంగా సన్మానించింది. సేవా భారతి బిరుదను ప్రదానం చేసింది. అక్టోబర్ 2 మహత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన చికాగోలో జరుగుతున్న పలు సభలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో చికాగోలోని భారతీ తీర్థ సంస్థ ఆయనను ఆహ్వానించింది. సంగీత సాహిత్య రంగాలలో పేరు పొందిన చికాగో వాసి డాక్టర్ శొంఠి శారదా పూర్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. అమెరికాలో వివిధ రంగాల్లో సేవలందిస్తూ పేరు పొందిన డా. తాతా ప్రకాశం ‘సేవా భారతి’ బిరుదును ఆయనకు అందించారు. అనంతరం ప్రముఖ భాషావేత్త కోరాడ రామకృష్ణయ్య, ప్రపంచ భాషావేత్తలలో ఉత్తమ స్థానం పొందిన ప్రొఫెసర్ డా. కోరాడ మహాదేవ శాస్త్రి, గాంధేయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్రోద్యమవాది ఆనంద మార్గ అధ్యక్షులు డా సుసర్ల గోపాల శాస్త్రి, ప్రముఖ సాహితీవేత్త విజయనగర విఖ్యాత తాతా సుబ్బరాయ శాస్త్రి తదితరులు ఈ సన్మాన సభలో ప్రసంగించారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికాలో తెలుగు వారు చేస్తున్న సాంఘిక, రాజకీయ, సాహిత్య సేవలను ఆయన అభినందించారు. తెలుగు భాష విదేశాల్లోనే వెలుగు చూస్తోందని పేర్కొన్నారు. కాగా ఆంధ్ర దేశానికి చెందిన ‘నియోగి’ 111మంది విశిష్ఠ వ్యక్తుల గురించి రాసిన ‘అక్షర నక్షత్రాలు’గ్రంథాన్ని ఈ కార్యాక్రమంలో ఆవిష్కరించారు. గ్రంథ ఆవిష్కరణ తర్వాత తాజా మాజీ అధ్యక్షులు డా. జంపాల చౌదరి, చికాగో తెలుగు సాహితీ అధ్యక్షులు జయదేవ రెడ్డి, స్వప్నా వ్యవస్థాపక అధ్యక్షులు డా. శొంఠితో పాటు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం మిస్ జూడిత్ మండలి బుద్ధ ప్రసాద్‌కు ప్రత్యేక గుర్తింపు ప్రశంస పత్రాన్ని అందించగా. నేపర్విల్ అక్టోబర్ 26, 2019ని ప్రత్యేక రోజుగా గుర్తిస్తూ ఆయన పేరు మీద గుర్తింపు పంత్రాన్ని అందజేశారు. -
పోరాటాల పురిటిగడ్డ..అవనిగడ్డ
సాక్షి, అవనిగడ్డ : జిల్లాకు తూర్పున.. కృష్ణమ్మ చెంతన ఏర్పడింది అవనిగడ్డ నియోజకవర్గం. ఆరు మండలాలతో అతిపెద్ద నియోజక వర్గంగా ఖ్యాతికెక్కింది. ప్రశాంత కు మారుపేరైన ఈ పల్లెసీమల నుంచే ఎందరో ఉద్దండులైన రాజ కీయ నాయకులు జన్మించారు. ఇక ఉద్యమాలకు ఊపిరిలూదిందీ ఈ పురిటిగడ్డే. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. గాంధీ జీ ఉద్యమ స్పూర్తికి ఊపిరి పోశా రు. జమిందారీ వ్యవస్థ్ధపై ఉక్కుపిడికిలి బిగించారు. భూపోరాటా లతో మార్గదర్శకులయ్యారు. 1952 అవనిగడ్డ దివి నియోజకవర్గంగా ఏర్పడింది. దివి ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అవనిగడ్డ, నిడుమోలు నియోజకవర్గాలు కలిసి ఉండేవి. దివి తాలూకా నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవారు. అవనిగడ్డ నియోజకవర్గంకు జిల్లాలో ప్రత్యేకతక ఉంది. 1972లో ఏకగీవ్రం కాగా జిల్లాలో ఈ ఘనత సాధిం చారు. అవనిగడ్డ. ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు హాట్రిక్ సాధించారు కమ్యునిస్టు యోధులు చండ్రరామలింగయ్య, గుంటూరు బాపనయ్య, సనకా బుచ్చికోటయ్యతో గాంధేయవాది మండలి వెంకటకృష్ణారావు, దేవుడి మంత్రి సింహాద్రి సత్యనారాయణ వంటి నాయకులను ఈ గడ్డ అందించింది. ఏడుసార్లు కాంగ్రెస్.. ఆరు సార్లు టీడీపీ 1962లో అవనిగడ్డ నియోజకవర్గం ఏర్పడింది. 1962ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వై శివరాంప్రసాద్, కమ్మునిస్టు పార్టీ అభ్యర్ధి సనకా బుచ్చికోటయ్యపై 2992 ఓట్లతో గెలుపొందారు. 1967లో ఈ ఇద్దరే తలపడగా శివరాం ప్రసాద్ 8663ఓట్లతో గెలుపొందారు. 1972లో మండలి వెంకట కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో మండలి వెంకట కృష్ణారావు, జనతా అభ్యర్థి సైకం అర్జునరావుపై 490 ఓట్లతో గెలుపొందారు. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు గెలుపొందారు. 1985లో టీడీపీ అభ్యర్ధి సింహాద్రి సత్యనారాయణరావు, మండలి వెంకట కృష్ణారావుపై 6683ఓట్లతో గెలుపొందారు. 1989లో వీరిద్దరే పోటీపడగా సింహాద్రి సత్యనారాయణరావు 167ఓట్లతో గెలుపొందారు. 1994లో సింహాద్రి సత్యనారాయణరావు, కాంగ్రెస్ అభ్యర్ధి మండలి బుద్ధప్రసాద్‌పై 5377ఓట్లతో గెలుపొందారు. 1999లో మండలి బుద్ధప్రసాద్, టీడీపీ అభ్యర్ధి బూరగడ్డ రమేష్నాయుడుపై 794ఓట్లతో గెలుపొందారు. 2004లో వీరిద్దరే పోటీపడగా, మండలి బుద్ధప్రసాద్ 8483ఓట్లతో గెలుపొందారు. 2009లో టీడీపీ అభ్యర్ధి అంబటి బ్రహ్మణయ్య, మండలి బుద్ధప్రసాద్‌పై 417ఓట్లతో గెలుపొందారు. 2013లో బ్రాహ్మణయ్య మరణంతో జరిగిన ఎన్నికల్లో ఆయన తనయుడు అంబటి శ్రీహరిప్రసాద్, ఇండిపెండెంట్ అభ్యర్ధి సైకం రాజశేఖర్‌పై 61,644 ఓట్లతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మండలి బుద్ధప్రసాద్, సింహాద్రి రమేష్‌బాబుపై 5859 ఓట్ల తేడాతో గెలుపొందారు. హ్యాట్రిక్లతో పాటు మంత్రి పదవులు అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో యార్లగడ్డ శివరాంప్రసాద్ 1955, 1962, 1967 వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందం మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేయగా, 1972, 1978, 1983లో మండలి వెంకట కృష్ణారావు హ్యాట్రిక్ సాధించగా, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. 1985, 1989, 1994లో హ్యాట్రిక్ సాధించిన సింహాద్రి సత్యనారాయణరావు ఎన్టీరామారావు, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేశారు. 1962, 1967లో సనకా బుచ్చికోటయ్య, 1985, 1989లో మండలి వెంకటకృష్ణారావు, 1999, 2004లో బూరగడ్డ రమేష్‌నాయుడు వరుసగా పరాజయం పాలయ్యారు. తండ్రీ కొడుకులు మండలి వెంకట కృష్ణారావు, మండలి బుద్ధప్రసాద్ ఇద్దరినీ ఓడించిన ఘనత సింహాద్రి సత్యనారాయణకు దక్కింది. జిల్లాలో ఏకైక ఏకగ్రీవ నియోజకవర్గం 1972లో జరిగిన ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో ఏకైక ఏకగ్రీవ నియోజకవర్గంగా అవనిగడ్డ రికార్డు సాధించింది. మూడు సార్లు హ్యాట్రిక్ సాధించి, మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణరావు 2004లో ఇండిపెండెంట్‌గా పోటీచేయగా 14,845 ఓట్లతో మూడో స్ధానంకు పరిమితమయ్యారు. సామాజిక వర్గాలే కీలకం కాపు సామాజిక వర్గం : 69,500 బీసీలు : 64,600 మత్స్యకార సామాజిక వర్గం : 29,400 ఎస్సీలు : 41,450 ఎస్టీలు : 6,460 ఉన్నారు కమ్మ సామాజిక వర్గం : 9,800 మంది ముస్లీంలు : 3,840 నియోజకవర్గం జనాభా : 2,63,771 ఓటర్లు : 2,12,830 పురుషులు : 1,06,171 స్త్రీలు : 1,06,640 పోలింగ్ బూత్‌లు మొత్తం : 266 -
తిరుమల మ్యూజియం అభివృద్ధి చేయాలి
తిరుమల: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియంను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసనసభ ఫిర్యాదుల కమిటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలలోని మ్యూజియంను అక్షరధామ్ మ్యూజియం తరహాలో తీర్చిదిద్ది, శ్రీవారి వైభవ ప్రాశస్త్యాన్ని, క్షేత్ర మహిమను భక్తకోటికి చేరుకునే కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీకి సూచన చేస్తామన్నారు. టీటీడీ ప్రచురణలు, సాహిత్య సంపదను ఇంటెర్నెట్ ద్వారా జన బాహుళ్యానికి చేరవేసేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ధార్మిక సంస్థ అయిన టీటీడీ ధర్మప్రచారానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.