ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్‌ | Election Commission Serious On Removing Of Votes Issue In AP | Sakshi
Sakshi News home page

ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్‌

Mar 3 2019 7:20 PM | Updated on Mar 3 2019 7:56 PM

Election Commission Serious On Removing Of Votes Issue In AP - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) సీరియస్‌ అయ్యింది.  ఓట్ల తొలగింపుకు సంబంధించి తప్పుడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్లకు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌ కృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ఆదివారం గోపాల్‌ కృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. వారం కిందట వేల సంఖ్యలో ఓట్ల తొలగింపునకు ఫారం-7  అప్లికేషన్లు వచ్చినట్లు ఈసీ గుర్తించిందన్నారు. ఆన్‌లైన్‌లో గుంపగుత్తగా ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. ఓటర్లకు తెలియకుండా ఓట్లు తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తులపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 9 జిల్లాల్లో 45 కేసులు నమోదు చేశామని చెప్పారు. 

ఓటర్ల తొలగింపు సమాచారం తెలిస్తే ఎన్నికల సంఘానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీడాక్‌ సహకారంతో ఐపీ అడ్రస్‌ల ఆధారంగా బాధ్యుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 6 మీ-సేవా కేంద్రాలపై కూడా కేసులు పెట్టినట్లు వెల్లడించారు. ఫారం-7 దరఖాస్తులపై సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. అనుమతి లేకుండా ఓట్లు తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.  ఓట్ల తొలగింపు ఫిర్యాదులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement