గవర్నర్కు కూడా ఎన్నికల కోడ్! | Election code to Governor! | Sakshi
Sakshi News home page

గవర్నర్కు కూడా ఎన్నికల కోడ్!

Mar 13 2014 6:37 PM | Updated on Aug 14 2018 4:32 PM

వినోద్ జుట్సి - Sakshi

వినోద్ జుట్సి

గవర్నర్‌కు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని డిప్యూటి ఎన్నికల కమిషనర్, రాష్ల్ర ఎన్నికల నిర్వహణ బాధ్యుడు వినోద్ జుట్సి చెప్పారు.

హైదరాబాద్ : గవర్నర్‌కు కూడా  ఎన్నికల కోడ్ వర్తిస్తుందని డిప్యూటి ఎన్నికల కమిషనర్, రాష్ల్ర ఎన్నికల నిర్వహణ బాధ్యుడు  వినోద్ జుట్సి చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేసేలా గవర్నర్ వ్యవహరించకూడదని ఆయన చెప్పారు. నామినేషన్ల చివరరోజు వరకు కొత్త ఓటర్ల నమోదు కొనసాగుతుందన్నారు.  

ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉండే  ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించినట్లు ఆయన తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించేలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఇప్పటికే 16 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు  జుట్సి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement