వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య! | elderly woman raped murdered in Boduppal | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య!

Feb 11 2014 10:21 AM | Updated on Sep 2 2017 3:35 AM

మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలిపై అత్యాచారం చేసి ఆమెను హతమార్చారు.

మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోడుప్పల్కు చెందిన లక్ష్మమ్మ (50) అనే మహిళ గత అర్థరాత్రి దారుణ హత్యకు గురైంది. దీంతో స్థానికులు మంగళవారం ఉదయం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

లక్ష్మమ్మ మృతికి గల కారణాలపై పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మమ్మపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement