ప్రశాంతంగా ఎడ్‌సెట్ | Edcet exam held peacefully | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎడ్‌సెట్

May 31 2014 2:31 AM | Updated on Oct 20 2018 6:17 PM

బీఈడీ కోర్సులో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు శుక్రవారం నిర్వహించిన ఎడ్‌సెట్-14 ప్రశాంతంగా ముగిసింది.

నెల్లూరు (టౌన్), న్యూస్‌లైన్: బీఈడీ కోర్సులో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు శుక్రవారం నిర్వహించిన ఎడ్‌సెట్-14 ప్రశాంతంగా ముగిసింది. నెల్లూరులోని డీకేడబ్ల్యూ, సర్వోదయ, వీఆర్‌లా కళాశాలలతో పాటు సెయింట్ జోసఫ్, సంతపేటలోని మోడల్ హైస్కూల్లో పరీక్ష నిర్వహించారు.

2,323 మందికి గాను 1,983 మంది హాజరయ్యారు. కావలిలోని జేబీ కళాశాలలో నిర్వహించిన పరీక్షకు 275 మంది హాజరయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని అధికారులు ముందే ప్రకటించడంతో అభ్యర్థులుందరూ ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. జిల్లా పరిశీలకురాలుగా ఇందిరా ప్రసూన వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement