ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు భేఖాతర్‌ 

The EC Has Given The Exemption From The Election Code To The Former Leaders Of The Election - Sakshi

సాక్షి, ఎమ్మిగనూరురూరల్‌: దివంగత నేతల విగ్రహాలకు ఈ ఎన్నికల కోడ్‌ నుంచి మినహాంపును ఎన్నికల కమిషన్‌ ఇచ్చింది. విగ్రహాలకు ముసుగులు వేయరాదని ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను ఎమ్మిగనూరు అధికారులు భేఖాతర్‌ చేస్తున్నారు. పార్లపల్లి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ముసుగు తొలగించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పట్టణంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వేసిన ముసుగును మున్సిపల్‌ అధికారులు తొలగించారు. అయితే పార్లపల్లి గ్రామంలో మాత్రం విగ్రహానికి తొడిగిన ముసుగు తొలగించేందుకు చర్యలు తీసుకోవడం లేదు.  ఇప్పటికైనా అధికారులు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను పాటించి విగ్రహానికి వేసిన ముసుగు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

ఎన్నికల కోడ్‌ వీటికి వర్తించదా..? 
ఎమ్మిగనూరు రూరల్‌: ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి పోస్టర్లు, ఫ్లెక్సీలు కనిపించరాదు. ఉంటే వాటిని తొలగించాలి. అయితే, ప్రభుత్వాసుపత్రిలో ఎన్‌టీఆర్‌ వైద్య సేవలకు సబంధించిన పోస్టురుతో పాటు తల్లీబిడ్డ వ్యాన్‌కు సీఎం చంద్రబాబు బొమ్మలు దర్శనమిస్తున్నాయి. రోడ్డుపై వ్యాన్‌ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి కోడ్‌ అమలు పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top