‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల చేయొద్దన్నాం’

EC Dwivedi Comments On Lakshmis NTR Movie Release In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయవద్దని ఆదేశాలు జారీచేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కడపలో రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శించారని, ఆ థియేటర్‌ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు కేంద్ర సీఈసీకి సిఫార్స్ చేశామని చెప్పారు. రీ పోలింగ్‌పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు.

ఐదు పోలింగ్ బూత్‌ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. అదనపు ఈవీఎంలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. శ్రీకాకుళంలో వర్షాల వల్ల స్ట్రాంగ్ రూమ్‌లకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, తుఫాన్ కారణంగా నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్ నుంచి సీఈసీ మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఈ నెల 7న సిబ్బందికి  ట్రైనింగ్ ఇస్తున్నామని వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top