తూర్పులో సమైక్య సెగలు | East godavari district wide supports to ys jagan deeksha | Sakshi
Sakshi News home page

తూర్పులో సమైక్య సెగలు

Aug 28 2013 10:52 AM | Updated on Jul 25 2018 4:09 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లాలో సమైక్య సెగలు మిన్నంటాయి.

సమైక్యాంధ్రకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లాలో సమైక్య సెగలు మిన్నంటాయి. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆమరణ నిరాహరదీక్షలు చేపట్టారు. జగన్ దీక్షకు మద్దతుగా ముమ్మిడివరంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష బుధవారం 5వ రోజుకు చేరింది. అలాగే అయినవల్లి మండలం ముక్తేశ్వరంలో మందపాటి కిరణ్కుమార్ చేపట్టిన దీక్ష 2 రోజుకు చేరుకుంది. వీటీతోపాటు ఉప్పలగుప్తంలో కమిడి చిన్నపరాజు చేపట్టిన దీక్ష కూడా రెండవ రోజుకు చేరుకుందన్నారు.

 

అయితే జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి నదిలో జలయాత్ర చేపట్టింది. మధ్యాహ్నం గంటి పెదపూడి నుంచి పి.గన్నవరం వరకు ఆ యాత్ర కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. సరైన ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే విద్యాసంస్థలకు యాజమాన్యం సెలవులు ప్రకటించారు. దుకాణదారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement