‘డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి’ | dwakra Loans should be waived | Sakshi
Sakshi News home page

‘డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి’

Jul 12 2014 2:50 AM | Updated on Sep 29 2018 6:00 PM

‘డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి’ - Sakshi

‘డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి’

డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ డిమాండ్ చేశారు.

గంట్యాడ : డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ డిమాండ్ చేశారు. నీలావతి ఎస్సీ కాలనీలో డ్వాక్రా మహిళలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రుణాలు రద్దు చేయాలని కోరుతూ మహిళల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలని కోరారు. రుణాల మాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం రోజుకో మాట చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసేవరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెప్పారు. అందులోభాగంగానే సంతకాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్. పరదేశమ్మ, బి. ఎల్లమ్మ, ఆర్. ముత్యాలమ్మ, దాలమ్మ, టి. పరదేశి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement