రాజధాని రోడ్లతో పంటలపై దుమ్ము | dust on the roads of the capital of crops | Sakshi
Sakshi News home page

రాజధాని రోడ్లతో పంటలపై దుమ్ము

Oct 29 2015 2:06 AM | Updated on Jun 4 2019 5:16 PM

రాజధాని రోడ్లతో పంటలపై దుమ్ము - Sakshi

రాజధాని రోడ్లతో పంటలపై దుమ్ము

తాడేపల్లి మండలంలోని ఉండవల్లి పొలాల నుంచి వేసిన డొంక రోడ్డును రబ్బీస్ తో నిర్మించడం వలన....

గగ్గోలు పెడుతున్న రైతులు
 
తాడేపల్లి: తాడేపల్లి మండలంలోని ఉండవల్లి పొలాల నుంచి వేసిన డొంక రోడ్డును రబ్బీస్ తో నిర్మించడం వలన దానిలోని వస్తున్న దుమ్ము దూళీతో పంట పొలాలల్లో మేటలు వేయడంతో పంట దిగుబడి రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నమని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపన పేరుతో తాత్కాలిక రోడ్డును ఏర్పరిచిన అధికారులు దానిపై నుంచి వస్తున్న దుమ్ము దూళీ వలన ఉల్లి, పూలమొక్కలతో పాటు పంట పొలాల దిగుబడి రాక తీవ్ర అవస్థలకు గురవుతున్నామంటున్నారు. 

ఉండవల్లి ఇసుక రీచ్‌ల నుంచి వస్తున్న లారీల వల్ల దుమ్ము ఉల్లి పంటకు ఎండపడక ఆక్సిజన్ తగ్గడం వలన పంట ఎండిపోయే స్థితిలో ఉన్నట్లు అదే విదంగా లిల్లీ, గులాబీ, కనకంబరం తదితర పూలు పంటపై దుమ్ము పడడంతో పూల మార్కెట్టుతో వాటి ధర గణనీయంగా పడిపోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే సమయంలో ఈ రోడ్డుపై పోసిన బుడిద రూపంలో వస్తున్న దూళీ పొలాల్లో పనిచేస్తున్న రైతులుకు సైతం తీవ్ర అగచాట్లుకు గురి అయ్యేలా చేస్తున్నాయని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఉద్యానవన శాఖాధికారులు వెంటనే స్పందించి తమ భాదలను తీరేలా చూడాలని రైతులు వేడుకోంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement