కనక దుర్గమ్మకు ఆషాఢ సారె..

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పవిత్ర సారెను సమర్పించారు. వైదిక కమిటీ కమిటీ సభ్యులు,అర్చకులకు ఆలయ మర్యాదలతో ఈవో ఎంవీ సురేష్‌బాబు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను తమ ఆడపడుచుగా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి