30 సెకన్లలోనే అన్ని వివరాలు

DSP Vasanth Kumar Press Meet About new Mobile Apps Launched In Vijayawada Division - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంతకల్లు, నెల్లూరు డివిజన్‌ పరిధిలో కొత్త మొబైల్‌ యాప్స్‌ను రూపొందించినట్లు నెల్లూరు డీఎస్పీ వసంత్‌ కుమార్‌ గురువారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 8.4 లక్షల నేరగాళ్ల డేటాను ఆన్‌లైన్‌లో పొందిపరిచినట్లు తెలిపారు. మొబైల్‌ గుర్తింపు పరికరంలో నేరగాళ్లు ఏ వేలిముద్ర వేసిన వాళ్ల వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఇంతకముందు ఎడమచేతి బొటన వేలి ముద్రలను తీసుకునే వారని తెలిపారు.వేలిముద్ర వేయగానే 23 నుంచి 30 సెకన్లలో అన్ని వివరాలు నమోదవుతాయని వెల్లడించారు. దీని ద్వారా నేరాలు జరగకుండా నియంత్రించవచ్చని, నేరాగాళ్ల కదలికలను గుర్తించడంలో తేలికవుతుందన్నారు. అలాగే 15 పోలీస్‌ స్టేషన్లకు అధికారులు 30 మొబైల్‌ సెక్యూరిటీ చెక్‌ డివైస్‌లను అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు. అదే విధంగా రైళ్లలో రోజుకు 60 నుంచి 70 బీట్లు ఉంటాయని, బీట్‌ళో ఉన్న సిబ్బంది ట్యాబ్‌, సెల్‌ ద్వారా మెసేజ్‌, వీడియోను ఈ యాప్‌ ద్వారా పంపవచ్చన్నారు. వేసవిలో ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక  చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top