హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు | Drug racket busted again in Hyderabad, 4 held | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

Oct 23 2013 11:32 AM | Updated on Oct 17 2018 5:27 PM

హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. గుట్టుగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్ : హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. గుట్టుగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయినవారిలో ఓ నైజీరియన్తో పాటు ముగ్గురు కర్ణాటకకు చెందినవారు ఉన్నారు. వీరు రాజకీయ, సినీ ప్రముఖులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం. ముంబయి, డిల్లీ, కోల్కత్తా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ముఠా సభ్యులను విచారిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ...నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement