వాహనాలకు.. డ్రైవింగ్ లెసైన్స్, పెట్రోల్ కోసం ఆధార్‌కార్డు తప్పనిసరిగా మారింది. అందుకు రవాణాశాఖ, మెప్మా అధికారులు జిల్లాలో ఆధార్ అనుసంధానాన్ని ముమ్మరం చేశారు.
వాహనాలకు.. డ్రైవింగ్ లెసైన్స్, పెట్రోల్ కోసం ఆధార్‌కార్డు తప్పనిసరిగా మారింది. అందుకు రవాణాశాఖ, మెప్మా అధికారులు జిల్లాలో ఆధార్ అనుసంధానాన్ని ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా 4 లక్షలకు పైగా వాహనాలు, డ్రైవింగ్ లెసైన్స్‌లు ఉండగా కేవలం అందులో 10శాతం మాత్రమే అనుసంధానం కావడంపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాల్టీల పరిధిలోని పెట్రోలు బంకుల్లో మెప్మా, రవాణా సిబ్బంది ఆధార్ నమోదు చేసుకుంటున్నారు.
ఆధార్ సీడింగ్‌పై ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఆధార్ సీడింగ్‌పై ఉప రవాణా కమిషనర్ శివరాంప్రసాద్ ‘సాక్షి’ రిపోర్టర్‌గా మారి నగరంలో పర్యటించారు. వాహనదారులను ఇంటర్వ్యూ చేశారు. ఉప రవాణాశాఖ కార్యాలయంలో అధికారుల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. డీటీసీ శివరాం ప్రసాద్ వీఐపీ రిపోర్టు యథాతథంగా..
ప్రజలు ఆధార్ సీడింగ్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి అపోహలు వద్దు. వాహనాలు, డ్రైవింగ్ లెసైన్స్‌లకు ఆధార్ అనుసంధానంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆధార్‌పై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడతాం. ఆధార్ సీడింగ్ వల్ల వాహనం చోరీకి గురైనా వెంటనే పసిగట్టే అవకాశం ఉంది. ఆధార్ నంబర్ ఎంటర్‌చేస్తే తెలుసుకునే అవకాశం ఉంది. వాహనదారులకు ప్రమాదబీమా సౌకర్యం కల్పించనున్నారు. లెసైన్స్, ఆర్సీ ఎక్కడైనా కనిపించకపోయినా, చోరీకి గురైనా వెంటనే డూప్లికేట్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
-డీటీసీ