డబుల్ డెక్కర్ రైలు వచ్చేసింది! | double decker train run on the track | Sakshi
Sakshi News home page

డబుల్ డెక్కర్ రైలు వచ్చేసింది!

Feb 25 2014 12:31 AM | Updated on Sep 4 2018 5:07 PM

డబుల్ డెక్కర్ రైలు వచ్చేసింది! - Sakshi

డబుల్ డెక్కర్ రైలు వచ్చేసింది!

దక్షిణ మధ్య రైల్వేలో రెండు డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు.


త్వరలో కాచిగూడ నుంచి ప్రారంభం  
ఒకటి తిరుపతికి, మరోటి గుంటూరుకు
 
 కాజీపేట, న్యూస్‌లైన్: దక్షిణ మధ్య రైల్వేలో రెండు డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు. వీటిలో ఒక రైలు కాచిగూడ నుంచి గుంటూరుకు, మరో దానిని కాచిగూడ నుంచి కాజీపేట మీదుగా తిరుపతికి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా కాజీపేటకు రంగురంగుల డబుల్ డెక్కర్ ఏసీ రైలు శనివారం సాయంత్రం వ చ్చింది. ఈ రైలు పంజాబ్‌లోని కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపుదిద్దుకుంది. దీనిని కాజీపేట అధికారులు  రైల్వే యార్డులో ఉంచారు. కొద్ది రోజుల్లోనే కాచిగూడలో రైల్వే మంత్రి దీనిని ప్రారంభించనున్నారు. కాగా, ఈ డబుల్ డెక్కర్‌ను ప్రయాణికులు, స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.
 
  రెండంతస్తుల రైలు ప్రత్యేకత లు..
 
 డబుల్ డెక్కర్ రైలులో 16 బోగీలుంటాయి. వీటిలో ఇంజిన్ ముందు, వెనక రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లుండగా 14 బోగీలకు ఏసీ సౌకర్యం ఉంటుంది.
 
 రైలు మొత్తంలో 1680 మంది ప్రయాణీకులు కూర్చునే వీలుంటుంది. ఒక డబుల్ డెక్కర్ కోచ్‌లో (కింద, పైన) కలిపి 120 మంది కూర్చుంటారు.
 గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న మన రైళ్ల వేగం గంటకు 120 కి.మీ..
 బయోమెట్రిక్ టాయ్‌లెట్స్ సౌకర్యం ఇందులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement