పోలవరం పేరిట చిచ్చుపెట్టొద్దు: సీపీఐ | don't play the games in polavaram -cpi | Sakshi
Sakshi News home page

పోలవరం పేరిట చిచ్చుపెట్టొద్దు: సీపీఐ

May 29 2014 1:57 AM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం పేరిట చిచ్చుపెట్టొద్దు: సీపీఐ - Sakshi

పోలవరం పేరిట చిచ్చుపెట్టొద్దు: సీపీఐ

పోలవరం ప్రాజెక్టు పేరిట తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టొద్దని సీపీఐ ఏపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడడం ఏ మాత్రం సమంజసం కాదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పేరిట తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టొద్దని సీపీఐ ఏపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడడం ఏ మాత్రం సమంజసం కాదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఏటా రెండు మూడు వేల టీఎంసీల గోదావరి నదీజలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని, వాటిని సద్వినియోగ పరిచే ప్రయత్నాన్ని అడ్డుకోవద్దని టీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా మాత్రమే వెనుకబడిన, కృష్ణా నది ఎగువ ప్రాంతాలకు నీరందించడానికి వీలవుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సత్వర న్యాయం జరిపించాలని, భూమి కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని రామకృష్ణ కోరారు
 
 

Advertisement
 
Advertisement
Advertisement