ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకోం | don't critism on our Mla | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకోం

Feb 3 2016 3:05 AM | Updated on Oct 30 2018 5:04 PM

అనంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై కోగటం విజయభాస్కర్‌రెడ్డి విమర్శలు చేయడం అన్యాయంగా ఉందనీ

అనంతపురం రూరల్: అనంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై కోగటం విజయభాస్కర్‌రెడ్డి విమర్శలు చేయడం అన్యాయంగా ఉందనీ, అభివృద్ధిని కాంక్షిస్తున్న ఎమ్మెల్యేపై అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బంగి నాగేంద్ర, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవాంజనేయులు హెచ్చరించారు.  మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న కోగటం లాంటి నేతలకు నగర అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదన్నారు.

ఎక్కడి నుంచే అనంతకు వలస వచ్చిన విషయాన్ని కోగటం గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచి దన్నారు.  లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో  టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మారుతి కుమార్, నాయకులు కదిరెప్ప, మేదర చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement