మెరుగనిపించారు! | District students Talents in Inter 2nd year results | Sakshi
Sakshi News home page

మెరుగనిపించారు!

Apr 29 2015 4:56 AM | Updated on Sep 3 2017 1:02 AM

ఇంటర్‌మీడియట్ విద్యార్థులు ఈ సారి సత్తా చాటారు. అ‘ద్వితీయ’ ఫలితాలతో మెరిశారు.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 69 రాషస్థ్రాయిలో జిల్లాకు 7వ స్థానం
పరీక్ష రాసిన వారు 30,270
ఉత్తీర్ణులైన వారు 20,999
బాలుర ఉత్తీర్ణత శాతం 66
బాలికల ఉత్తీర్ణత శాతం 73

 
కర్నూలు(జిల్లా పరిషత్) : ఇంటర్‌మీడియట్ విద్యార్థులు ఈ సారి సత్తా చాటారు. అ‘ద్వితీయ’ ఫలితాలతో మెరిశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థుల్లో 30,270 మందికి గాను 20,999 మంది(69శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురు 16,200 మందిలో 10,663 మంది(66శాతం), బాలికలు 14,070 మందిలో 10,336(73శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటుగా పరీక్ష రాసిన విద్యార్థుల్లో 6,759 మందికి గాను 2,216(33శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ర్టవ్యాప్తంగా జిల్లాకు 7వ స్థానం దక్కింది. గత ఏడాది జిల్లా 9వ స్థానంలో నిలిచింది.

వొకేషనల్‌లో...
1,893 మందికి గాను 1,290(68శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురు 1,477 మందికి గాను 997(68 శాతం), బాలికలు 416 మందికి గాను 293(70శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటుగా రాసిన వారిలో మొత్తం 334 మంది దరఖాస్తు చేసుకోగా 128మంది(38శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ప్రభుత్వ కళాశాలల్లో...
 జిల్లాలోని 41 ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 6,317 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,345 మంది(69శాతం) మంది ఉత్తీర్ణత
 సాధించారు. ఇందులో బాలురు 3,448 మందికి గాను 2,438(70.71శాతం), బాలికలు 2,869 మందిలో 1,907(66.47శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో బాలికల కంటే బాలురే ఈసారి నాలుగు శాతానికి పైగా అధికంగా ఉత్తీర్ణులయ్యారు.

ఎయిడెడ్ కాలేజిల్లో...
జిల్లాలోని ఎయిడెడ్ కాలేజిలో 1,540 మందికి గాను 880 మంది(57శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురల్లో 788 మందికి గాను 382 మంది(48.48శాతం), బాలికల్లో 752 మందికి గాను 498(66.22శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement