ఒకే ఆవరణలో రెండు అసెంబ్లీల నిర్వహణపై చర్చ | Discussion on two assemblies management in the same premise | Sakshi
Sakshi News home page

ఒకే ఆవరణలో రెండు అసెంబ్లీల నిర్వహణపై చర్చ

Jun 26 2014 7:15 PM | Updated on Aug 25 2018 6:21 PM

కోడెల శివప్రసాద్ - సిరికొండ మధుసూదనాచారి - Sakshi

కోడెల శివప్రసాద్ - సిరికొండ మధుసూదనాచారి

ఒకే ఆవరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రెండు అసెంబ్లీల నిర్వహణపై ఈ రోజు ఇక్కడ జరిగిన స్పీకర్ల సమావేశంలో చర్చ జరిగింది.

హైదరాబాద్: ఒకే ఆవరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రెండు అసెంబ్లీల నిర్వహణపై ఈ రోజు ఇక్కడ జరిగిన స్పీకర్ల సమావేశంలో చర్చ జరిగింది.  ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిల సమావేశం ముగిసింది. ప్రధానంగా ఇరు రాష్ట్రాల అసెంబ్లీ వ్యవహారాల అంశంపైనే చర్చించారు.  ఏపీ అసెంబ్లీని జూబ్లీహాల్‌లో నిర్వహించే అంశం ప్రతిపాదనకు వచ్చింది.

ఇద్దరు స్పీకర్లు మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ, కౌన్సిల్‌ ఒకేచోట నిర్వహించాలన్న ప్రతిపాదనపై చర్చించారు. జులై మొదటి వారంలో మరోదఫా ఇరు రాష్ట్రాల స్పీకర్లు సమావేశమవుతారు. ఈ రోజు జరిగిన సమావేశంలో స్పీకర్లతోపాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement