ఆనందపురంలో దర్శకుడు రాజమౌళి | director rajamouli in anandapuram | Sakshi
Sakshi News home page

ఆనందపురంలోసినీ దర్శకుడు రాజమౌళి

Nov 11 2017 10:54 AM | Updated on Nov 11 2017 10:55 AM

director rajamouli in anandapuram - Sakshi

ఆనందపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రాజమౌళి

ఆనందపురం (భీమిలి): దర్శక దిగ్గజం, బాహుబలి దర్శకుడు ఎస్‌. ఎస్‌.రాజమౌళి శుక్రవా రం ఆనందపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజమౌళికి విజయనగరం జిల్లాలో కొంత జిరాయితీ భూమి ఉంది.

దానిని విక్రయించి ఇక్కడకు రిజిస్ట్రేషన్‌ చేయడానికి వచ్చారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సిబ్బంది ఆయన సంతకాలు తీసుకున్నారు. రాజమౌళి వచ్చారని తెలిసి కొంతమంది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పరుగులు తీయగా అప్పటికే ఆయన వెళ్లి పోయారు

Advertisement
 
Advertisement
Advertisement