ఉద్యోగుల పంపిణీపై 23న వీడనున్న సందిగ్ధం | Dilemma on Employees distribution to be solved on july 23rd | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పంపిణీపై 23న వీడనున్న సందిగ్ధం

Jul 20 2014 3:03 AM | Updated on Sep 2 2017 10:33 AM

రాష్ట్ర క్యాడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలపై ఏర్పడిన సందిగ్ధం ఈ నెల 23న తొలగనుంది.

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర క్యాడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలపై ఏర్పడిన సందిగ్ధం ఈ నెల 23న తొలగనుంది. ఆ రోజు ఢిల్లీల్లో కమలనాథన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కేంద్ర సిబ్బంది-శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనావర్మతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్. కృష్ణారావు, రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు పీవీ రమేశ్, నాగిరెడ్డి పాల్గొంటారు. రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారికి ఆప్షన్లు ఇవ్వటంపై అభిప్రాయాన్ని తరువాత చెబుతామని ఏపీ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముసాయిదా మార్గదర్శకాల్లోనే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement