పాలకొల్లులో తీవ్రమౌతున్న డయేరియా | Diarrhea grips Palakollu | Sakshi
Sakshi News home page

పాలకొల్లులో తీవ్రమౌతున్న డయేరియా

Oct 10 2015 6:36 PM | Updated on Sep 3 2017 10:44 AM

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో డయేరియా వ్యాధి తీవ్ర రూపం దాలుస్తోంది.

పాలకొల్లు అర్బన్ : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో డయేరియా వ్యాధి తీవ్ర రూపం దాలుస్తోంది. శనివారం పట్టణంలోని పెద్దపేట, 16వ వార్డు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అంతకు ముందు రెండు రోజుల్లో సుమారు 100 మంది వరకు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

వీరే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొంత మంది బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాగా, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్.విజయగౌరి శనివారం పరామర్శించారు. మంచి నీరు కలుషితం కావడమే దీనికి కారణంగా స్థానికులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement