అతిసారతో 20 మందికి అస్వస్థత | Diarrhea grips Kondupalem village | Sakshi
Sakshi News home page

అతిసారతో 20 మందికి అస్వస్థత

Dec 18 2015 4:50 PM | Updated on Sep 3 2017 2:12 PM

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొండుపాలెం గ్రామవాసులు ఉన్నట్టుండి అస్వస్థత పాలయ్యారు.

అనకాపల్లి : విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొండుపాలెం గ్రామవాసులు ఉన్నట్టుండి అస్వస్థత పాలయ్యారు. శుక్రవారం  ఉదయం 11 గంటల నుంచి పెద్దలు, పిల్లల్లో అతిసార లక్షణాలు బయటపడ్డాయి. వాంతులు, విరేచనాలతో తీవ్రంగా బాధపడుతున్న ముగ్గురు చిన్నారులను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 15 నుంచి 20 మందిని సబ్బవరం ఆస్పత్రికి తరలించారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంతమంది అస్వస్థతకు గురవ్వడంతో గ్రామంలో పరిస్థితి అయోమయంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement