టీడీపీ నేతలు ఎక్కడ? 

Dharmana Krishna Das Slams On Chandrababu - Sakshi

ప్రజలకు బాసటగా లేకుండా విమర్శలకే పరిమితం 

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ 

సాక్షి, పోలాకి: రాష్ట్రంలో ఇకపై చంద్రబాబు అండ్‌ కో కుట్రలు సాగనివ్వబోమని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. వారి ఆలోచనలు కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరంగా కన్పిస్తున్నాయని ఆరోపించారు. ఆదివారం మబగాం క్యాంప్‌ కార్యాలయం నుంచి మంత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆఖరికి టీడీపీ విమర్శలు చేయడానికి మాత్రమే పనికొచ్చే పార్టీగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రాథమిక కార్యాచరణ లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందంటూ విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటివరకూ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కనీస స్పందన లేని నాయకులుగా వారికి పదవుల్లో వుండే అర్హత లేదన్నారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగిస్తే రాష్ట్రంలో యాక్షన్‌ప్లాన్‌తో సిద్ధంగా వున్నామని తెలిపారు. క్షేత్రస్ధాయిలో వలంటీర్లు, వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందితోపాటు ఇతర వ్యవస్ధలు చేపడుతున్న చర్యలు అద్భుతమని మంత్రి కృష్ణదాస్‌ కొనియాడారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో వుంచి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నాలుగు కోవిడ్‌ ఆసుపత్రులు, పదుల సంఖ్యలో క్వారంటైన్‌ సెంటర్లు సిద్ధం చేసి వుంచామని తెలిపారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top