శ్రీవారిని దర్శించుకున్న లక్షా 700 మంది భక్తులు | Devotees Huge Rush at Tirumala Temple | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న లక్షా 700 మంది భక్తులు

Jun 14 2015 8:53 AM | Updated on Aug 28 2018 5:55 PM

శ్రీవారిని దర్శించుకున్న లక్షా 700 మంది భక్తులు - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న లక్షా 700 మంది భక్తులు

తిరుమలలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని శనివారం ఒక్క రోజు లక్షా 700 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.

తిరుమల: తిరుమలలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని శనివారం ఒక్క రోజు లక్షా 700 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆదివారం తిరుమలలో శ్రీనివాసరాజు మాట్లాడుతూ... శ్రీవారిని ఒక్క రోజులో ఇంతమంది భక్తులు దర్శించుకోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రధమం అని ఆయన అన్నారు.

సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని శ్రీనివాసరాజు స్పష్టం  చేశారు. రద్దీ నేపథ్యంలో ప్రోటోకాల్ పరిధిలోని వారికే మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు. లడ్డూల తయారీ 1.50 లక్షల నుంచి 3.50 లక్షలకు పెంచామని శ్రీనివాసరాజు న్నారు. అయితే తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దేవుని దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్ల వెలుపల బారులు తీరారు.

Advertisement
 
Advertisement
Advertisement