వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి | development with YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి

Dec 20 2013 3:26 AM | Updated on Jun 1 2018 8:47 PM

వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

వజ్రకరూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.  వజ్రకరూరులో సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహానేత కాలం నాటి సువర్ణయుగం తిరిగి రావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీకి అధికారం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలన్నారు. పార్టీని బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
 
 పజా సమస్యలపై ఎప్పటికప్పుడు వైఎస్సార్‌సీపీ పోరాడుతోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకొస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమైక్య రాష్ర్టంలోనే ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారందరినీ ఓటరుగా నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తిప్పేస్వామి, బీసీ సెల్ నేత తిరుపాల్, నేతలు రాజశేఖరరెడ్డి, కమలపాడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement