‘వారిపై కఠిన చర్యలు’

Deputy CM Narayana Swami Press Meet On Adulterated Toddy - Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు ఎక్కడ జరగకుండా ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు చేపట్టింది. దీంతో మద్యం లభించక మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తోన్నారు. అయితే ఇదే అదునుగా చేసుకొని కల్తీ మద్యం తయారు చేసే వారు రెచ్చిపోతున్నారు. అనేక మంది ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా తయారు చేసే వారిపై ప్రభుత్వం ప్రత్యేక దాడులు నిర్వహిస్తోంది. (మా ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా: కర్నూలు ఎంపీ)

ఈ విషయం పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ....నాటుసారా పై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా దాడులు చేస్తున్నామన్నారు. నాటుసారా తయారీదారులు, వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటువంటి వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు పెట్టాలని ఎస్ఫీలను ఆదేశించామని నారాయణ స్వామి తెలిపారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇప్పటి వరకు 4371 కేసులు నమోదు చేసినట్లు నారాయణ స్వామి తెలిపారు. వారిలో 4435మందిని అరెస్ట్‌ చేశామన్నారు. సుమారు 37,632 లీటర్ల ఐడీ, 31 టన్నుల నల్లబెల్లం సీజ్‌ చేసిట్లు తెలిపారు. దీంతో పాటు 1130 వాహనాలను సీజ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  (అసాధారణ విజయాలివి : విజయసాయిరెడ్డి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top