అందుకే ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం..

Deputy CM Amjad Basha Said YSRCP Government Opposes CAA And NRC Bills  - Sakshi

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

సాక్షి, అనంతపురం: సీఏఏ, ఎన్‌ఆర్‌సీ బిల్లులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. శనివారం జిల్లాలోని ఉరవకొండలో జరిగిన మైనార్టీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మత ప్రాతిపదికన విభజిస్తున్నారని.. తమ పౌరసత్వానికే ముప్పు ఉందని ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని అందుకే కేంద్రం తెచ్చిన బిల్లులను వ్యతిరేకిస్తున్నామని’ ఆయన తెలిపారు. ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు నిర్మించింది కేవలం తాత్కాలిక రాజధాని మాత్రమే అని.. ఏపీ లోని అన్ని జిల్లాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని వివరించారు. సీఎం జగన్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని అంజాద్‌ బాషా పేర్కొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top