బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం | Depression over Bay of Bengal | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Sep 10 2013 8:11 AM | Updated on Sep 1 2017 10:36 PM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కొనసాగుతోంది. దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కూడా స్థిరంగా ఉంది.

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా మారాయని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్ లోనూ గతరాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement