బంగాళాఖాతంలో వాయుగుండం: విశాఖ తుఫాన్ కేంద్రం | Depression formed in Bay of Bengal | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో వాయుగుండం: విశాఖ తుఫాన్ కేంద్రం

Nov 14 2013 9:49 AM | Updated on Sep 19 2019 2:50 PM

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలో తుఫాన్ హెచ్చరికల కేంద్రం గురువారం వెల్లడించింది.

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలో తుఫాన్ హెచ్చరికల కేంద్రం గురువారం వెల్లడించింది. ఆ వాయుగుండం నెల్లూరు - తమిళనాడు తీరాల మధ్య 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా, తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో కృష్ణపట్నం, పలు ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement