ఆకాశాన్ని తాకుతున్నాయి.. | Demand for aircraft Sankranti | Sakshi
Sakshi News home page

ఆకాశాన్ని తాకుతున్నాయి..

Jan 13 2015 12:53 AM | Updated on Jul 6 2018 3:36 PM

ఆకాశాన్ని తాకుతున్నాయి.. - Sakshi

ఆకాశాన్ని తాకుతున్నాయి..

విశాఖ విమానాశ్రయం లో సంక్రాంతి సందడి ఫుల్లుగా కనిపిస్తోంది. కోస్తాంధ్ర ప్రజలకు కేంద్రం గా వుండడంతో విమానాలన్నీ కిటకిటలాడుతున్నాయి.

విమానాలకు సంక్రాంతి డిమాండ్
ఫిబ్రవరి ఒకటి వరకూ  టికెట్ చార్జీల మోత

 
గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం లో సంక్రాంతి సందడి ఫుల్లుగా కనిపిస్తోంది. కోస్తాంధ్ర ప్రజలకు కేంద్రం గా వుండడంతో  విమానాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విశాఖ నుంచి ఇండిగో, ఎయిర్‌కోస్తా, ఎయిరిండియా, స్పైస్ జెట్ విమాన సర్వీసులు వున్నా యి. ఈనెల 11 వరకూ సా ధారణంగా వున్న విమాన చార్జీలు సోమవారం  నుంచి అమాంతంగా పెరిగిపోయాయి. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టే వచ్చే వారి సంఖ్య టికెట్‌ల డిమాండ్‌ని బట్టి తెలుస్తోంది. విశాఖ నుంచి చెన్నైకి వెళ్లే విమాన సర్వీసులకు బాగా డిమాండ్ కనిపించింది. సోమవారం నాటి టికెట్ చార్జీ రూ.6942 ఉంటే బుధవారానికి దాని రేటు రూ.9440, ఈ నెల 21నాటికి రూ.10,642 పలికింది. ఇలా 23నాటికి రూ.9281 ఉన్నా తర్వాత నుంచి చార్జీలు తగ్గాయి. అదే  చెన్నై నుంచి విశాఖకూ విమాన ఛార్జీల మోత ఎక్కువగానే వుంది.

12న టికెట్ చార్జి 2999 వుంటే, 13నుంచి రూ 7523, 14 న రూ7610 పలికింది. తర్వాత 19నాటికి టికెట్ ఛార్జి రూ 9441 వుంది. తర్వాత నుంచి కాస్త డిమాండ్ తగ్గింది. రూ 3114 నుంచి చార్జీలు వున్నాయి. ఇదిలా వుంటే...విశాఖ నుంచి హైదరాబాద్‌కి సాధారణంగా రూ1558 నుంచి 2804 వరకూ  వుండే విమాన చార్జి సోమవారం 4802 వుంది. ఈనెల16నాటికి రూ 5326, 18న రూ. 6818 రేటు వుంది. విశాఖ నుంచి ఢిల్లీకి సాధారణంగా నాలుగు వేలుంటే...ఇపుడు రూ 14982 పలుకుతోంది. ఫిబ్రవరి ఒకటి వరకూ డిమాండ్ వుంది. విశాఖ నుంచి బెంగుళూరుకి  ఈనెల12న 4725 వుంటే...13న రూ. 6142, 15న 8086, 17న రూ11,403, 18న రూ13,502  పలికింది. అలాగే తిరుపతికి వెళ్లే యాత్రికులూ ఈనెలలో ఎక్కువగానే వున్నారు. సోమవారం నాటి చార్జి 5987 వుంటే 18న మాత్రం రూ 7464 వుంది. 26న రూ.8599...ఇలా ఫిబ్రవరి 8నాటికి రూ.3015 వుంది. మొత్తంమ్మీద ఫిబ్రవరి ఒకటి వరకూ విమానాల రద్దీ వుందని విమాన సంస్ధలు చెబుతున్నాయి. ఈనెల 18 వరకూ విపరీతమయిన డిమాండ్ వుందని..పలు విమాన సర్వీసులకయితే టికెట్లే లేవని స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా వుంటే ట్రావెల్ ఏజెంట్లకు ఈడిమాండ్ పంటపడుతోంది. ప్రయాణికుల డిమాండ్‌ని బట్టి రెట్టింపు చార్జిలు చెబుతున్నారు. ఈనెల 18న చెన్నైకి వెళ్ల డానికి రూ టికెట్ చార్జీ రూ20 వేలు వుందంటే విమాన ప్రయాణికుల తాకిడి ఎలా వుందో తెలుస్తోంది.

http://img.sakshi.net/images/cms/2015-01/61421090724_Unknown.jpg
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement