
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఫీజు చెల్లించాలని కళాశాలయాజమాన్యం ఒత్తిడి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ఫీజు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి
కళాశాల ఎదుట బంధువుల ఆందోళన
పోలీసులకు ఫిర్యాదు
చోడవరం: ఫీజు చెల్లించాలని కళాశాలయాజమాన్యం ఒత్తిడి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి...మండలంలోని లక్కవరానికి చెందిన బర్ల ప్రసాద్(20) చోడవరం ఎస్‌ఎస్‌పీ డిగ్రీ కళాశాలలో బికాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఈశ్వరరావు, దేముడమ్మలు రైతు కూలీలు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా కష్టపడి కొడుకును చదివిస్తున్నారు. డిగ్రీ పరీక్ష ఫీజు రూ.2500లు చెల్లించడానికి గడువు గతనెల 30వ తేదీతో ముగిసిపోయింది. అపరాధరుసుముతో చెల్లిం చేందుకు డబ్బులు తీసుకుని రెండ్రోజుల కిం దట అకౌంటెంట్ వద్దకు విద్యార్థి వెళ్లాడు. బకా యి ఉన్న కళాశాల ఫీజు రూ.5900లు కూడా చెల్లిస్తేనే పరీక్ష ఫీజు తీసుకుంటానని అకౌం టెంట్ తెగేసి చెప్పారు. తన వద్ద ప్రస్తుతం అంత డబ్బులులేవని, త్వరలోనే ఫీజు కడతానని చెప్పినా అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులకు ఈ విష యం చెప్పలేక కుమిలిపోయాడు. మంగళవారం కళాశాలకని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ప్రసాద్ తనతోపాటు తెచ్చుకున్న పురుగుమందును మార్గమధ్యలో తాగాడు.
నురగలు కక్కు తూ కిందపడిపోయిన అతనిని అటుగావెళుతు న్న గ్రామస్తులు చోడవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థి ఆత్మహత్యకు కారణాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో బంధువులు, గ్రా మస్తులు కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వా గ్వాదం చోటుచేసుకుంది. తమకు సంబంధంలేదని కళాశాల కరస్పాండెంట్ త్రినాథ్ చెప్పడం తో వారు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుచేసి పరీక్షఫీజు తెచ్చామని, కళాశాల ఫీజు కూడా త్వరలోనే కడతామని చెప్పి నా.. కళాశాలయాజమాన్యం ఒత్తిడి వల్లే తమ కొడుకు ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు వాపోయారు. ఇదిలావుండగా ఫీజు విషయం తన దృష్టికి రాలేదని కళాశాల కరస్పాండెంట్ చెప్పారు.