రాష్ట్ర చరిత్రలో డిసెంబర్ 5 బ్లాక్ డే: విశ్వరూప్ | December 5th is black day in state history, says vishwaroop | Sakshi
Sakshi News home page

రాష్ట్ర చరిత్రలో డిసెంబర్ 5 బ్లాక్ డే: విశ్వరూప్

Dec 6 2013 2:24 PM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.

రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ముఖ్యమంత్రి తెలివితక్కువతనంతో వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిసెంబర్‌ 5  బ్లాక్‌ డే అని విశ్వరూప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆందోళనలో పాల్గొనడం హాస్యాస్పదమని విశ్వరూప్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement