పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు..

Datsun Car Rams into canal, three saved - Sakshi

సాక్షి, రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలోకి వెళితే అయినవిల్లి మండలం మడుపల్లి వద్ద  డస్టన్‌ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. రావులపాలెంకు చెందిన మోతమర్రి రాంబాబు తన పెళ్లిరోజు కావడంతో భార్యా,కుమార్తెతో కలిసి సోమవారం అయినవిల్లి విఘ్నేశ్వర దేవాలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ....వారిని బయటకు తీశారు. కాగా వినాయకుడి దయవల్లే తాము ఘోర ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డామని రాంబాబు పేర్కొన్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top