గ్రామస్థులపై దాడి, నిరసనగా ధర్నా

Dachepally Mandal Villagers Protesting At Chettinadu Cement Factory  - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఉద్రిక్తత నెలకొంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పొయి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక వలస కార్మికుల విషయానికి వస్తే సొంత గ్రామాలకు వెళ్లలేక ఉన్న చోట ఉపాధిలేక, ఆహారం దొరకక, తలదాచుకోవడానికి నీడ లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెట్టినాడు సిమెంట్‌ ఫ్యాకర్టీలో బీహార్‌ నుంచి వచ్చిన చాలా మంది కార్మికులు పని చేస్తోన్నారు. (యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ కేసులే ఎక్కువ)

అయితే లాక్‌డౌన్‌ కారణంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందో చూడటానికి బుధవారం పెదగార్లపాడు గ్రామస్థులు వారి వద్దకు వెళ్లారు. వారికి సాయం అందించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లగా వారిపై సిమెంట్‌ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడింది. దీంతో గ్రామస్థులు దాడికి నిరసనగా ఫ్యాక్టరీ ఎదుట ధర్నాకి దిగారు. కరోనా కారణంగా సామాజిక దూరం పాటించాల్సిన సమయంలో ఇలా జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. (ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top