చంద్రబాబుకు భగవంతుడు మార్గం చూపినా ... | CPI state Secretary Ramakrishna takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు భగవంతుడు మార్గం చూపినా ...

Oct 2 2014 12:30 PM | Updated on Aug 13 2018 4:30 PM

చంద్రబాబుకు భగవంతుడు మార్గం చూపినా ... - Sakshi

చంద్రబాబుకు భగవంతుడు మార్గం చూపినా ...

రైతు రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: రైతు రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీపై చంద్రబాబు చెప్పిన దానికి... చేస్తున్నదానికి పొంతనే లేదని విమర్శించారు. చంద్రబాబుకు భగవంతుడు మార్గం చూపిన... రైతుకు మాత్రం ఆయన మార్గం చూపడం లేదంటూ ఎద్దేవా చేశారు.

గురువారం హైదరాబాద్లో రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ... రుణమాఫీపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడి మాయ చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర చేసేటప్పుడు ఓ మాట...  ఎన్నికలప్పుడు ఓ మాట మాట్లాడుతున్నారని అన్నారు. తొలి సంతకం రోజున ఓ మాట... ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. వెంటనే అఖిల పక్ష సమావేశం  ఏర్పాటు చేసి రుణమాఫీపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని చంద్రబాబును రామకృష్ణ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement