సింగపూర్ వాసులను కేబినెట్ లో చేర్చుకుంటారేమో! | cpi rama krishna takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

సింగపూర్ వాసులను కేబినెట్ లో చేర్చుకుంటారేమో!

Dec 8 2014 1:31 PM | Updated on Jul 28 2018 6:48 PM

సింగపూర్ వాసులను కేబినెట్ లో చేర్చుకుంటారేమో! - Sakshi

సింగపూర్ వాసులను కేబినెట్ లో చేర్చుకుంటారేమో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని విమర్శించారు. రైతులను దొంగలుగా చిత్రీకరించడం ఆయనకు తగదని రామకృష్ణ సూచించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా రుణాలన్నీ మాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒక పైసా మాఫీ చేయకుండానే చంద్రబాబు సన్మానాలు చేయించుకుంటున్నారని రామకృష్ణ చురకలంటించారు.

 

ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. రాజ్యాంగం అనుమతిస్తే సింగపూర్ వాసులను చంద్రబాబు మంత్రి వర్గంలో చేర్చుకుంటారేమోనని రామకృష్ణ ఎద్దేవా చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement