కలకలం రేపిన ‘సంచిలో శవం’ | Cow Dead Body in Bag | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన ‘సంచిలో శవం’

May 18 2018 5:28 PM | Updated on May 18 2018 5:28 PM

Cow Dead Body in Bag - Sakshi

సంచిలో ఆవుదూడ మృతదేహం

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని ములకలచెరువు మండలం బురకాయలకోట గురుకుల పాఠశాల వద్ద ఉన్న చెన్నాయన చెరువులో ఓ సంచి శుక్రవారం కలకలం రేపింది. వ్యక్తిని హత్యచేసి సంచిలో పెట్టి చెరువులో పడేసినట్లు వదంతులు చుట్టుపక్కల ఉండే గ్రామాలకు అలుముకుంది. స్థానికులు ఎస్‌ఐ ఈశ్వరయ్యకు సమాచారం అందించారు. విషయం తెలిసిన ఎస్‌ఐ హుటాహూటిన తన సిబ్బందితో చెరువు వద్దకు చేరుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సంచిని విప్పారు. సంచి లోపల చనిపోయిన ఆవుదూడ ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా 20 రోజుల కిందట ఇదే చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అయితే ఆ మృతదేహం ఆచూకి ఇంత వరకు తెలియ లేదని ఎస్‌ఐ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement