సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్‌

CoronaVirus: CM YS Jagan Review Meeting With Officials - Sakshi

సాక్షి, తాడేపల్లి : కరోనా లక్షణాలు ఉన్న వారు నిర్భయంగా ముందుకొచ్చి ఆరోగ్య వివరాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల వివరాలను, ప్రార్థనల కోసం ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లిన వారి వివరాలను అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. అంతేకాకుండా కొత్తగా నమోదైన కేసుల్లో చాలా మంది ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్నవారేనని వివరించారు. 

కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌
ఢిల్లీ వెళ్లిన వారు, కాంటాక్ట్‌లో ఉన్నవారు ముందుకొచ్చి చికిత్స తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. ఢిల్లీ వెళ్లిన వారిని గుర్తించి పరీక్షలు చేసి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం అర్భన్‌ ప్రాంతాల్లో కరోనా నియంత్రణపై పూర్తి సమాచారాన్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ముందుకొచ్చి ఆరోగ్య వివరాలు అందించాలని, లేదంటే వారి కుటుంబసభ్యులకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. షెల్టర్లలో ఉన్నవారికి కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌ చేయాలని సీఎం ఆదేశించారు. 

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దుకాణాల ముందు ధరల పట్టికను తప్పకుండా ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేసే విధంగా అధికారులకు మార్గనిర్దేశకాలు ఇచ్చాం. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అరటి, టమాట రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ని​ల్వచేయలేని పంటల విషయంలో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. రైతు భరోసా కేంద్రాల ఆధ్వ​ర్యంలో జనతా మర్కెట్‌లపై ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి. ఆక్వారైతులు, ఆక్వా రంగ అనుబంధ పరిశ్రమలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  69 ప్రాసెసింగ్‌ యూనిట్లలో 41 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. అమెరికా, చైనా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

చదవండి:
కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి
హ్యాట్సాఫ్‌ డాక్టర్‌ నరేంద్ర

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-05-2020
May 30, 2020, 12:54 IST
నెల్లూరు, తడ: తడ మండలంలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఎంపీడీఓ జి.శివయ్య సమాచారం మేరకు తడకండ్రిగ పంచాయతీ పరిధిలోని...
30-05-2020
May 30, 2020, 10:54 IST
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తన యాంటీ-వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ మార్కెటింగ్ అనుమతి కోరుతూ భారతదేశ డ్రగ్ రెగ్యులేటర్‌కు...
30-05-2020
May 30, 2020, 10:25 IST
చెన్నై,తిరువొత్తియూరు: బిచ్చమెత్తిగా వచ్చిన నగదును ఓ వృద్ధుడు కరోనా నివారణకు సాయంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. శివగంగై సమీపంలోని...
30-05-2020
May 30, 2020, 09:41 IST
లండన్‌: కరోనా సంక్షోభ సమయంలో యూకేలో ప్రజలకు సేవ చేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ వైద్యుడు హోటల్‌ గదిలో...
30-05-2020
May 30, 2020, 09:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన...
30-05-2020
May 30, 2020, 09:33 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభంగా కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ...
30-05-2020
May 30, 2020, 09:05 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పాత కంటైన్మెంట్ల పరిధిలో కరోనా కేసుల తీవ్రత తగ్గినప్పటికీ...ప్రస్తుతం రోజుకో కొత్త ప్రాంతంలో వైరస్‌ వెలుగు...
30-05-2020
May 30, 2020, 08:49 IST
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌లో ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన క్యాంప్‌లన్నీ ఎత్తివేయడంతో వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  భవన...
30-05-2020
May 30, 2020, 08:13 IST
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ వృద్ధుల పాలిట శాపంగా మారుతోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితోపాటు మధుమేహం,హైపర్‌ టెన్షన్‌(బీపీ), నిమోనియా...
30-05-2020
May 30, 2020, 08:08 IST
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో సంబంధాలను తెగదెంపులు...
30-05-2020
May 30, 2020, 07:49 IST
కంటికి కనిపించని ప్రాణాంతక కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని తమను తాము కాపాడుకుంటూ బాధిత రోగులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యులు,సిబ్బంది...
30-05-2020
May 30, 2020, 07:38 IST
లాలాపేట:  పెళ్లి కుమారుడు వంశీకృష్ణ గ్రూప్‌–1 అధికారి, పెళ్లి కూతురు హర్షవర్థిని గ్రూప్‌–2 ఆఫీసర్‌. వీరిద్దరి వివాహం శుక్రవారం తార్నాక...
30-05-2020
May 30, 2020, 07:06 IST
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో మణిరత్నం తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఒకటి. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ,...
30-05-2020
May 30, 2020, 07:02 IST
‘‘టీనేజ్‌ నుంచి నా జీవితం రేస్‌లా పరిగెడుతూనే ఉంది. విరామం అనేది లేకుండా. కానీ ఇలాంటి బ్రేక్‌ (లాక్‌డౌన్‌) ఎప్పుడూ...
30-05-2020
May 30, 2020, 05:50 IST
న్యూఢిల్లీ: 137 ఏళ్లుగా రైల్లో తెల్ల డ్రెస్సుపై నల్ల కోటు ధరించి దగ్గరికొచ్చి టికెట్‌ చెక్‌ చేసే రైల్వే టికెట్‌...
30-05-2020
May 30, 2020, 05:21 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 101 మందిని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య...
30-05-2020
May 30, 2020, 05:15 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్న వేళ దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 24...
30-05-2020
May 30, 2020, 04:57 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 ముగిసిన తరువాత కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే అధికారం ఇవ్వాలని...
30-05-2020
May 30, 2020, 04:53 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19ను ఎదుర్కొ నేందుకు అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉన్నా మని, ఎవరూ భయపడవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
30-05-2020
May 30, 2020, 04:26 IST
ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా శుక్రవారం మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top