పాత కక్షలతోనే కాంట్రాక్టర్ హత్య | contractor grievous murder | Sakshi
Sakshi News home page

పాత కక్షలతోనే కాంట్రాక్టర్ హత్య

Aug 29 2013 1:54 AM | Updated on Jul 30 2018 8:27 PM

పాత కక్షల కారణంగానే కాంట్రాక్టర్ గోగుల హన్మంతు హత్యకు గురైనట్లు రామచంద్రాపురం డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌లు తెలిపారు

 జిన్నారం, న్యూస్‌లైన్ :పాత కక్షల కారణంగానే కాంట్రాక్టర్ గోగుల హన్మంతు హత్యకు గురైనట్లు రామచంద్రాపురం డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌లు తెలిపారు. బుధవారం వారు బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో హత్యకు గల కారణాలను విలేకరులకు వెల్లడించారు. వరంగల్ జిల్లా రామన్నగూడెం గ్రామానికి చెందిన గోగుల హన్మంతు కొన్నేళ్లుగా బొల్లారంలో నివాసం ఉంటూ కాంట్రాక్టు పనులను చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే బొల్లారంలోనే నివాసముంటున్న అల్లుడు వేముల యాదయ్యతో హన్మంతుకు తరచూ గొడవ లు జరుగుతుండేవి. దీంతో ఏడాది క్రితం హన్మంతుపై హత్యాయత్నానికి యాదయ్య ఒడిగట్టాడు. చేసేది లేక హన్మంతు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు మారాడు. 
 
 ఎప్పటికైనా తనను యాదయ్య చంపుతాడని హన్మంతు భయపడేవాడు. ఈ క్రమంలో యాదయ్యను చంపాలంటూ తన స్నేహితుడైన రాజుతో రూ. 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బు కూడా యాదయ్యకు ఇచ్చేశాడు. ఈ డబ్బుతో రాజు ఓ ఎయిర్ తుపాకీ తీసుకువచ్చి యాదయ్యను చంపుతానని నమ్మించాడు. అయితే నెల రోజులవుతున్నా యాదయ్యను ఎందుకు చంపటం లేదని రాజును హన్మంతు నిలదీశాడు. ఇద్దరి మద్య మాటామాటా పెరిగింది. దీంతో రాజు విసుగు చెంది విషయాన్ని యాదయ్యకు వివరించాడు. హన్మంతును చంపేస్తే నేనే నీకు రూ. 12 లక్షలు ఇస్తానని యాదయ్య, రాజుకు చెప్పాడు. దీంతో ఇద్దరి మద్య ఒప్పందం కుదిరింది.
 
 యాదయ్యను చంపానని రాజు.. హన్మంతును నమ్మించాడు. ఓ నాలుగు రోజులు మాకు రక్షణ కావాలని రాజు, హన్మంతును కోరాడు. దీంతో వారిని సిద్దిపేట శివారులోని ఓ ఫాంహౌస్‌లో ఉంచాడు. రాజుతో పాటు ఆయన స్నేహితులు గోలేటి రమేష్‌రెడి ్డ(మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామం), మల్లిక సంజీవరెడ్డి (వరంగల్ జిల్లా మద్దూర్ గ్రామం), నర్సింలు (సుల్తాన్‌పూర్)లు కూడా సిద్దిపేటకు వచ్చారు. యాదయ్య మృతదేహం ఎక్కడ ఉందో నాకు చూపించాలని హన్మంతు రాజును కోరారు. సుల్తాన్‌పూర్ శివారులోని ఓ ఫౌంల్ట్రీఫాంవద్ద యాదగిరి మృతదేహం ఉందని రాజు నమ్మించి హన్మంతును అక్కడకు తీసుకువ చ్చాడు. 
 
 తీరా ఫాంహౌస్ వద్ద యాదయ్య మృతదేహం లేకపోవటంతో వీరి మధ్య వాగ్వాదం జరిగింది.
 దీంతో ఆగ్రహానికి గురైన రాజు, అతని స్నేహితులు కలిసి హన్మంతు మెడకు ఉరేసి చంపారు. హన్మంతుకు చెందిన బొలేరో వాహనంలో అతని మృతదేహాన్ని ఉంచి, రింగు రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో భాగంగా హన్మంతు హత్యకు కారణమైన ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ మధుసూధన్‌రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి ఓ ఎయిర్‌తుపాకీ, రూ. 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement