ఉగాది పర్వదినంపై సందిగ్ధత | Confusion surrounds Ugadi celebrations date | Sakshi
Sakshi News home page

ఉగాది పర్వదినంపై సందిగ్ధత

Mar 28 2014 1:18 PM | Updated on Aug 21 2018 11:41 AM

ఉగాది పర్వదినంపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 30వ తేదీనా? లేక 31వ తేదీనా? జరుపుకోవాలా అనే దానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది.

హైదరాబాద్ : ఉగాది పర్వదినంపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 30వ తేదీనా? లేక 31వ తేదీనా? జరుపుకోవాలా అనే దానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాత్రం 30వ తేదీ ఉగాది నిర్వహిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితి తలెత్తింది. శ్రీ జయనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్నీ అదే రోజు నిర్వహిస్తున్నారు.

ఎన్నికల కోడ్ ఉండటంతో.. ఈ ఉత్సవాలకు రాజకీయ నాయకులు లేకుండా..గవర్నర్ నిర్వహించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే  రాజకీయతేర ప్రముఖులకు, ఉన్నతాధికారులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. మరోవైపు తిరుమలతో పాటు భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 31నే ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement