సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన ఖరారు | YS Jagan's Tour to YSR District Confirmed on July 7 & 8 - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన ఖరారు

Jul 3 2020 4:06 PM | Updated on Jul 3 2020 5:52 PM

CM YS Jagan Tour Confirmed On July 7th And 8th In YSR District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. హరికిరణ్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ హరికిరణ్‌ జిల్లా అధికారులతో, ఎస్పీ అన్బురాజన్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌(ఎస్‌ఓపీ) తప్పనిసరిగా పాటించాలన్నారు. పర్యటనలో భాగంగా ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. బందోబస్తు పరంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని ఎస్పీ అన్బురాజన్‌కు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement