మంచి వ్యూహాలతో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం

CM YS Jagan Review On Nadu Nedu Programmes In Medical Health Department - Sakshi

ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి రూ.16వేల కోట్లు

కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలి

నాడు-నేడు కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్షించారు. ఆసుపత్రుల నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్‌ మొదటివారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు కింద వైద్య రంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ.16వేల కోట్లు ఖర్చువుతుందని సీఎం తెలిపారు.
(కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష)

ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం..
నాడు – నేడు కింద చేపట్టే పనులు ఇప్పటివారికే కాదని.. భవిష్యత్తు తరాలకూ సంబంధించిందని సీఎం పేర్కొన్నారు. వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. ప్రజలను రక్షించడానికి ఉపయోగపడతాయని.. అందుకే నాడు-నేడు కింద చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని.. మంచి వ్యూహాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పనులు చరిత్రాత్మకం కావాలన్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజారోగ్య వ్యవస్థ గురించి ఆలోచించడం లేదని.. రూ.16వేల కోట్లు ఖర్చుచేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాల కింద చేపట్టే పనులకు ప్రజలు, ఈ దేశం మద్దతుగా నిలబడుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
(పురోహితులను ఆదుకోండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top