విద్యా రంగంపై నేడు సమీక్ష | CM YS Jagan Review On Education Sector | Sakshi
Sakshi News home page

విద్యా రంగంపై నేడు సమీక్ష

May 27 2020 3:39 AM | Updated on May 27 2020 9:04 AM

CM YS Jagan Review On Education Sector  - Sakshi

సాక్షి, అమరావతి: ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విద్యా రంగంపై సదస్సు నిర్వహించనున్నారు. విద్యా రంగంలో ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరు, తదితర అనేక అంశాలపై ఈ సదస్సు జరుగుతుంది. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై మంచిచెడులను విశ్లేషిస్తూనే.. రానున్న కాలంలో చేపట్టాల్సిన వాటి గురించి కూడా ఇందులో చర్చిస్తారు. ఈ సదస్సుకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వివిధ విద్యా విభాగాలకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు, ఆయా కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులు దీనిలో పాల్గొని మాట్లాడనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement