టీచర్ల బదిలీలకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ | CM Jagan gives green signal to Teacher Transfers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల బదిలీకి సీఎం జగన్‌ ఆమోదం​

Jun 3 2020 3:10 PM | Updated on Jun 3 2020 6:59 PM

CM Jagan gives green signal to Teacher Transfers - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పారదర్శకంగా ఆన్‌లైన్‌ పద్ధతిలో బదిలీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పదో తరగతి పరీక్షల అనంతరం బదిలీలు చేపట్టాలని సీఎం జగన్‌ సూచించారు. బుధవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement