ఎయిర్‌ షో ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు | CM Chandrababu Attend The Air Show Program In Vijayawada | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ షో ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు

Nov 25 2018 3:25 PM | Updated on Nov 25 2018 3:29 PM

CM Chandrababu Attend The Air Show Program In Vijayawada - Sakshi

సీఎం చంద్రబాబు నాయుడు

సాక్షి,  విజయవాడ: నగరంలోని పున్నమి ఘాట్‌లో  జరుగుతున్న ఎయిర్ షో ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎయిర్ షో విన్యాసాలను తిలకించిన ఆయన అవి తనను అబ్బురపరిచాయని అన్నారు. అదేవిధంగా అమరావతిలో ప్రతిరోజూ ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు. అందమైన టూరిస్ట్ ప్రదేశాలు, నదులు, రిజర్వాయర్లు, వెయ్యి కిలొమీటర్ల సముద్ర తీరం ఉండటం ఏపీకి వరమన్నారు.

టూరిజాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని.. దానికి తగినట్లు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విమాన విన్యాసాలు చూసిన తర్వాత తను కూడా పైలెట్‌గా మారి విన్యాసాలు చేయాలనిపిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రంగా అమరావతి ప్రపంచంలోనే ఐదు సుందరమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement